: ఒకరిది అనుభవం...మరొకరిది జోరు...ఫెదరర్, జకోవిచ్ లలో విజేత ఎవరో!
రోజర్ ఫెదరర్ టెన్నిస్ ప్రపంచంలో తిరుగులేని రారాజుగా ఎదిగి ఫామ్ కోల్పోయి, అనుభవాన్ని రంగరించి పుంజుకునేందుకు శక్తియుక్తులన్నీ ధారపోస్తున్నాడు. అదే సమయంలో టెన్నిస్ లో తిరుగులేని రారాజు అనిపించుకోవాలని నొవాక్ జకోవిచ్ మంచి జోరు చూపిస్తున్నాడు. ఈ ఏడాదికి చివరి టైటిల్ అయిన యూఎస్ ఓపెన్ లో అంతిమపోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. పురుషుల టెన్నిస్ లో టాప్ సీడ్ జకోవిచ్, నెంబర్ టూ ఫెదరర్ మధ్య రసవత్తర పోరు జరగనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఇద్దరు హేమాహేమీల మధ్య పోరాటం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.