: టామ్ క్రూయిస్ సినిమా షూటింగ్ లో కూలిన విమానం
ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ క్రూయిస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా షూటింగులో ఓ విమానం కుప్పకూలింది. టామ్ క్రూయిస్ నటించిన తాజా చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్-రోగ్ నేషన్' ఇటీవల అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. అదే ఉత్సాహంతో టామ్ క్రూయిస్ 'మెనా' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం విమానంలో ఏరియల్ పుటేజ్ లు తీస్తుండగా ప్రమాదవశాత్తు విమానం కుప్పకూలిందని కొలంబియా పౌర విమానయాన శాఖాధికారులు తెలిపారు. ఈ ఘటనలో పైలట్, ఏరియల్ వ్యూ షూట్ చేస్తున్న వ్యక్తి మృత్యువాతపడ్డారని వారు వెల్లడించారు. సంఘటనా స్థలికి చేరుకున్న అధికారులు, మృతదేహాలను తరలించారు.