: భార్య అమల పుట్టిన రోజుకు నాగార్జున రొమాంటిక్ గిఫ్ట్
ప్రముఖ సినీ నటుడు నాగార్జున సతీమణి అమల పుట్టిన రోజును పురస్కరించుకుని మంచి రొమాటింక్ గిఫ్ట్ ను ఇచ్చారు. అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై నాగార్జున మరో నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ ను వెండితెరకు పరిచయం చేస్తూ 'నిర్మలా కాన్వెంట్' అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం రూపొందించిన ఓ పాటను భార్యకు అంకితమిచ్చారు నాగార్జున. 'ఒక్కసారి ఓ ముద్దు...ఒక చోట ఓ ముద్దు... ఒకలాగ ఓ ముద్దు...సరే ఇవ్వా...' అంటూ సాగే ఈ పాటను 'టు ద లవ్ ఆఫ్ మై లైఫ్' అంటూ నాగార్జున తన భార్యకు అంకితమిచ్చారు.