: లాస్ వెగాస్ లో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కు అరుదైన గౌరవం


బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కు అమెరికాలోని లాస్ వెగాస్ లో అరుదైన గౌరవం లభించింది. సెప్టెంబర్ 10వ తేదీని 'అనుపమ్ ఖేర్ డే'గా లాస్ వెగాస్ ప్రకటించింది. గత రెండు వారాలుగా అమెరికా, కెనడాల్లోని వివిధ రాష్ట్రాల్లో అనుపమ్ 'మేరా మతలబ్ వహ్ నహీన్ థా' అనే నాటికను ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన నేడు లాస్ వెగాస్ లో ఈ నాటికను ప్రదర్శించారు. ఈ ప్రదర్శన అనంతరం సినీ, నాటక రంగంలో ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన కృషి చేసిన అనుపమ్ ఖేర్ ను సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సెలెన్స్ తోపాటు అవార్డు అందజేసి లాస్ వెగాస్ సత్కరించింది. సెప్టెంబర్ 10ని అనుపమ్ ఖేర్ డేగా కూడా ప్రకటించారు. కాగా, ఈ మధ్యే లింగసమానత్వ బ్రాండ్ అంబాసిడర్ గా ఈయనను ఐక్యరాజ్యసమితి నియమించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News