: రెండు దశల్లో పూర్తయ్యే విశాఖ మెట్రో రైల్ వివరాలివే: వెంకయ్యనాయుడు


ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్టణంలో మెట్రో రైల్ నిర్మాణ వివరాలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వివరించారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, విశాఖపట్టణం మెట్రోరైల్ ప్రాజెక్టు పనులను రెండు దశల్లో పూర్తి చేస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన బిల్లులో పేర్కొన్నట్టు మెట్రో రైల్ ప్రాజెక్టులను కేటాయించిందని అన్నారు. ఎన్ఏడీ జంక్షన్ నుంచి కొమ్మాది వరకు ఒక దశ పనులు, గురద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు రెండో దశ పనులు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఈ మొత్తం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 12,727 కోట్ల రూపాయల వ్యయమవుతుందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News