: ఇంట్లోకి దూసుకెళ్లిన టీఎస్ ఆర్టీసీ బస్సు


ట్రైన్లు పట్టాలు వదిలేస్తుంటే...బస్సులు రోడ్లు వదిలేస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం వాచూరు వద్ద ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోకు చెందిన టీఎస్ ఆర్టీసీ బస్సు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. 20 మంది ప్రయాణికులతో భీమవరం నుంచి బయల్దేరిన బస్సు వాచూరు సమీపంలోకి రాగానే అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇంట్లోవాళ్లు సకాలంలో అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను గుంటూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News