: భూసేకరణ బిల్లుపై వెనక్కి తగ్గడంపై సోనియా ఇంటి వద్ద సంబరాలు
వివాదాస్పద భూసేకరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. భూసేకరణ బిల్లుపై కేంద్రం వెనక్కి తగ్గడంపై యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మిఠాయిలు పంచి, బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. మరోపక్క సామాజిక కార్యకర్త అన్నా హజారే కూడా తన దీక్ష ఆలోచనను విరమించుకున్న సంగతి తెలిసిందే. కాగా, బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో ఫలితాలపై ప్రభావం చూపేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా బిల్లుపై వెనక్కి తగ్గినట్టు ప్రచారం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా, నిన్నటి వరకు భూసేకరణ బిల్లును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎన్డీయే ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తగ్గడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.