: ఆల్బమ్ ప్రమోషన్ కోసం కొత్త చిట్కా కనిపెట్టిన సెలెనా గోమెజ్
యువ పాప్ సింగర్ సెలెనా గోమెజ్ కు అభిమానులకు కొదవలేదు. కొత్త ఆల్బమ్ రూపొందించిన సెలెనా తన ఆల్బమ్ ప్రమోషన్ కోసం కొత్త చిట్కా కనిపెట్టింది. 'రివైవల్' పేరిట రూపొందించిన ఈ ఆల్బమ్ ను సెలెనా అక్టోబర్ 9న విడుదల చేయనుంది. దీని ప్రమోషన్ ప్రారంభించిన సెలెనా గోమెజ్, అందులో భాగంగా పూర్తి నగ్నంగా ఫోటోకు పోజిచ్చింది. బ్లాక్ అండ్ వైట్ లో దిగిన ఈ ఫోటోను సెలెనా ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసింది. దిసీజ్ మై... అంటూ రెచ్చగొట్టే క్యాప్షన్ కూడా జతచేసిందండోయ్. 'ఫోటో బాగుంది, మరి ఆల్బమ్ ఎలా ఉంటుందో' అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.