: ఆ మీడియా అధిపతికి ట్విట్టరంటే ప్రాణం!


ప్రపంచంలో అతిపెద్ద మీడియా గ్రూపునకు ఆయన అధిపతి. పలుకుబడి విషయానికొస్తే మూడు ఖండాల్లో ఆయనంటే తెలియని వారు లేరు. ఆయన మీడియా గ్రూప్ ఆస్తుల విలువ లక్షల కోట్లు. ఆయన చెప్పాలనుకున్న దానిని తన మీడియా ద్వారా క్షణాల్లో ప్రపంచానికి చెప్పగలరు. కానీ, తాను చెప్పాలనుకున్న దానిని ట్విట్టర్ ద్వారా మాత్రమే ఆయన చెబుతుంటారు. ఆయనెవరు? ఎందుకట్లా చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తకమానవు. ఆయనే రూపర్ట్ మర్డోక్! ట్విట్టర్ పై మర్డోక్ కు ఈ మోజెందుకు? అంటే ఆయన జీవిత చరిత్ర రాసిన రచయిత వూల్ఫ్ చెప్పిన సమాధానం ఆసక్తికరంగా వుంది. డిజిటల్ పబ్లిషింగ్ కన్నా ముందుండాలనే ఉద్దేశ్యంతోనే మర్డోక్ ట్విట్టర్ ను ఎంచుకున్నారట. మర్డోక్ కు ట్విట్టర్ లో లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అమెరికా, చైనా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి, గ్రామీణ ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్స్ వంటి వాటి గురించి ఆయన పలు ట్వీట్లు చేశారు.

  • Loading...

More Telugu News