: మన దేశంలో రైల్వేస్టేషన్లకు గూగుల్ ఉచిత వైఫై
భారతీయ రైల్వే, గూగుల్ సంస్థకు మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ ఒప్పందంలో భాగంగా భారత్ లోని 400 రైల్వేస్టేషన్లకు ఉచితంగా వైఫై సౌకర్యం అందనుంది. మరో నాలుగు నెలల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. భారతీయ రైల్వేస్, గూగుల్ మధ్య టై అప్ తో ప్రయాణికులకు ఇంటర్నెట్ సౌకర్యం 24 గంటల పాటు అందుబాటులోకి వస్తుంది. ఇంటర్నెట్ యాక్సెస్ పొందే ప్రయాణికులకు మొదటి 34 నిమిషాల పాటు హైస్పీడ్ యాక్సెస్ ఉంటుందని, ఆ తర్వాత స్పీడ్ తగ్గుతుందని గూగుల్ వర్గాలు చెబుతున్నాయి. ఇక దేశంలో ఏఏ రైల్వే స్టేషన్లకు ఈ సౌకర్యం లభిస్తుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. రైల్వేస్టేషన్లను ఎంపిక చేయాల్సిన బాధ్యత మాత్రం భారతీయ రైల్వేస్ దే. 'ప్రాజెక్టు నీలగిరి' పేరిట గూగుల్ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఉచిత వైఫైకు సంబంధించి ప్రస్తుతం అమెరికాలో గూగుల్ ఫైబర్ ప్రాజెక్ట్ అమలులో ఉంది.