: 'కేబీసీ' పేరు విని మోసపోయిన వైజాగ్ ఎమ్మెస్సీ విద్యార్థిని!


"మేము 'కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాం. మీకు ప్రైజ్ మనీ వచ్చింది. దీన్ని పంపించాలంటే డీడీ ఖర్చులు, రవాణా చార్జీలను మీరు భరించాలి" అని వచ్చిన ఫోన్ కాల్ ను ఇంద్రజ అనే ఎమ్మెస్సీ చదువుతున్న విద్యార్థిని గుడ్డిగా నమ్మి మోసపోయింది. ఆపై విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించగా, వారు కోల్ కతాలో ఉన్న ప్రదీప్ చక్రవర్తి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఆంధ్రా యూనివర్శిటీలో ఇంద్రజ ఎమ్మెస్సీ విద్యను అభ్యసిస్తోంది. పశ్చిమ బెంగాల్ నివాసి ప్రదీప్ నుంచి అమెకు కొద్ది రోజుల క్రితం ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ నిజమైనదేనని భావించిన ఇంద్రజ కొంత డబ్బును పంపింది. ఇంద్రజ ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారు సైతం ఇటువంటి తప్పుడు కాల్స్ కు స్పందించడం తగదని సలహా ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News