: మూడు వారాల కనిష్ఠానికి తగ్గిన బంగారం ధర


ఇండియాలో బంగారం ధర మరో సెషన్లోనూ జారి పోయింది. శనివారం నాటి బులియన్ మార్కెట్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర, మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 100 తగ్గి రూ. 26,360 వద్దకు చేరింది. ఈ ధర మూడు వారాల కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. అక్టోబర్ 5న డెలివరీ అయ్యే లాట్ ధర 196 తగ్గి రూ. 25,967కు పడిపోయింది. వెండి ధర కిలోకు రూ. 300 తగ్గి రూ. 34,900కు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,103.30 డాలర్లుగా ఉంది. బంగారం కొనుగోళ్లకు డిమాండ్ లేని కారణంగానే ధరలపై ఒత్తిడి అధికంగా ఉందని బులియన్ ట్రేడర్లు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News