: విడాకులకు దరఖాస్తు చేసిన 'ఈగ' సుదీప్


ఈగ, బాహుబలి తదితర చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ నటుడు సుదీప్ విడాకులు కావాలని కోరుతూ, బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం దక్షిణాది సినీ వర్గాల్లో చర్చకు తెరలేపింది. సుదీప్, అతని భార్య ప్రియా రాధాకృష్ణన్ లు పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకుని కోర్టును ఆశ్రయించారని కన్నడ మీడియాలో నేడు వార్తలు వెలువడ్డాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కాదనుకోవడానికి కారణాలు ఏమైవుంటాయబ్బా? అని శాండల్ వుడ్ ఇప్పుడు గుసగుసలాడుకుంటోంది. 15 సంవత్సరాల క్రితం వీరు ప్రేమలో పడి, కొంతకాలం సహజీవనం చేసి ఆపై 2001లో పెళ్లి చేసుకున్నారు. వీరికి శాన్వీ అనే 11 సంవత్సరాల కుమార్తె కూడా ఉంది. దక్షిణాది చిత్ర సీమకు తెలిసినంతవరకూ వీరిది అన్యోన్య దాంపత్యమే.

  • Loading...

More Telugu News