: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం : ఎంఐఎం నేత ఒవైసీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. బీహార్ లో 40 స్థానాలకు పోటీ చేస్తామని చెప్పారు. దేశవ్యాపంగా తమ పార్టీని విస్తరింపజేయాలన్న లక్ష్యంతోనే బీహార్ నుంచి బరిలో నిలుస్తున్నామన్నారు. ఈ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు కనుక తాము సాధిస్తే సీమాంచల్ ప్రాంతీయ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తామని అసదుద్దీన్ పేర్కొన్నారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 2 సీట్లు సాధించిన విషయం తెలిసిందే.