: విపక్షాల మొసలి కన్నీరు : ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
రైతులపై విపక్ష పార్టీలు మొసలి కన్నీరు కారుస్తున్నాయంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. రైతుల పరిస్థితికి కాంగ్రెస్, టీడీపీ నాయకులే కారణమన్నారు. టీఆర్ఎస్ సర్కార్ పై బురదజల్లేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నారు. రూ.17 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేసిన ఘనత తమ సర్కార్ దేనని అన్నారు. రైతుల గురించి కాంగ్రెస్, టీడీపీ పార్టీలు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందన్నారు. రైతు ప్రయోనాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ పలు పథకాలకు రూపకల్పన చేస్తున్నారని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా ఉన్న 46 చెరువులను కేసీఆర్ హయాంలో పునరుద్ధరించామన్నారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కేసీఆర్ కృషి చేస్తున్నారని కర్నె ప్రభాకర్ అన్నారు.