: మక్కా ప్రమాద మృతుల్లో తెలంగాణ వాసి


సౌదీ అరేబియాలోని మక్కాలో ప్రసిద్ధి చెందిన గ్రాండ్ మసీదులో జరిగిన ఘోర ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా బోధన్ వాసి ప్రాణాలు కోల్పోయాడు. బోధన్ కు చెందిన షేక్ హైదర్ అలీ ఖాద్రీ (65) మక్కా సందర్శన నిమిత్తం సౌదీ వెళ్లాడు. శుక్రవారం ప్రార్థనల నిమిత్తం మసీదు లోపలికి ఖాద్రీ వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఖాద్రీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని భారత హైకమిషన్ వర్గాలు వెల్లడించాయి. దీంతో మృతుడి కుటుంబంలో విషాదం నిండుకుంది. మసీదును విస్తరించే పనులు జరుగుతుండగా, పైకప్పు పనుల నిమిత్తం వాడుతున్న క్రేన్ ఒక్కసారిగా కూలిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య 107కు చేరగా, 184 మంది గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

  • Loading...

More Telugu News