: ఎస్పీ మెడలో గొలుసు కొట్టేసిన దొంగ!
ప్రయాణికుల్లో ఉన్నతాధికారి ఎవరో, సాధారణ వ్యక్తి ఎవరో తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే ఆ దొంగ పొరపాటు పడ్డాడు. పోయిపోయి, ఎస్పీ మెడలో బంగారు గొలుసునే కొట్టేశాడు. ఈ సంఘటన సింహపురి ఎక్స్ ప్రెస్ లో చోటుచేసుకుంది. 'అప్పా'లో ఎస్పీగా పనిచేస్తున్న ఎస్ఎం రత్న సికింద్రాబాద్ నుంచి చెన్నైకు సింహపురి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించుకుపోయారు. ఈ సంఘటనలో గాయపడ్డ ఎస్పీ రత్నను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కాగా, చైన్ స్నాచర్ల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.