: ఏఆర్ రెహ్మాన్ పై మతపెద్దల ఆగ్రహం
మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహ్మాన్ పై మతపెద్దలు ఆగ్రహించారు. ఇరాన్ దేశంలో రూపొందించిన ఒక చిత్రానికి ఆయన సంగీతం అందించడమే అందుకు కారణమైంది. ఈ నేపథ్యంలో ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న సున్ని ముస్లిం గ్రూపు రజా అకాడమీ రెహ్మాన్ కు ఫత్వా జారీ చేసింది. మహమ్మద్ ప్రవక్త జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన రెహ్మాన్ మత వ్యతిరేకి అంటూ మతపెద్దలు మండిపడ్దారు. మహమ్మద్ ప్రవక్త జీవిత కథ ఆధారంగా మూడు చిత్రాల సీరీస్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాలకు దర్శకుడు మాజీద్ మజిదీ. మూడు చిత్రాలలో విడుదలైన మొదటి చిత్రం మొహమ్మద్ : ద మెసెంజర్ ఆఫ్ గాడ్. ఈ చిత్రానికే ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. మహమ్మద్ ప్రవక్త జీవితానికి సంబంధించి వక్రీకరించిన కొన్ని సంఘటనలు ఆ చిత్రంలో ఉన్నట్లు మత పెద్దలు ఆరోపించారు. ఈ చిత్రంపై భారత ప్రభుత్వం నిషేధం విధించాలని ముస్లిం మత సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.