: ఆన్ లైన్లో 200 మంది అమ్మాయిలను ఎలా మోసం చేశాడంటే..!


ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన అమ్మాయిలకు, తానో అమ్మాయిగా పరిచయమై, వారితో పరిచయాలు పెంచుకుని బెదిరింపులకు పాల్పడిన బీటెక్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థి అబ్దుల్ మాజిద్ (21)ను విచారించిన పోలీసులు విస్తుపోయే నిజాలను కనుగొన్నారు. ఈ దుర్మార్గుడు అమ్మాయిలకు ఎలా వలవేస్తాడన్న విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా జరుగుతున్న తంతును, 80 మంది నగ్న చిత్రాలను సంపాదించాడని తెలుసుకున్నారు. అయితే, వీటిని ఎక్కడా అప్ లోడ్ చేయలేదని పోలీసులు తెలిపారు. ఆరుగురు అమ్మాయిల పేరిట ఫేస్ బుక్ లో ఖాతాలు తెరిచిన మాజిద్, పలువురికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపాడు. తనకు ఫ్రెండ్స్ గా మారిన వారితో పరిచయాలు పెంచుకుంటాడు. తాను కొందరితో రహస్యంగా ప్రేమ వ్యవహారాలు నడిపానని, కొన్నిసార్లు ఆ ఆనందాన్ని కూడా అనుభవించానని చెప్పేవాడు. ఆపై నీకూ అటువంటి అనుభవాలున్నాయా? అని ఆరా తీసేవాడు. అందులో ఎంతో సుఖముందని చెప్పేవాడు. మనం చాటింగ్ చేస్తున్నది ఓ అమ్మాయితో కదా... అని అనుకుని తమ ప్రైవేటు వ్యవహారాలు పంచుకున్న వారే లక్ష్యంగా తదుపరి అంకానికి తెరలేపుతాడు. నా నగ్న చిత్రాలు ఇవిగో అంటూ వారి మెయిల్స్ కు కొన్ని ఫోటోలు పంపి, వారివి కూడా సేకరిస్తాడు. ఆపై బెదిరింపులకు దిగుతాడు. తన అసలు రూపం చూపి డబ్బు డిమాండ్ చేస్తాడు. ఇవ్వకుంటే, ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరిస్తాడు. వ్యక్తిగతంగా కలవాలని డిమాండ్ చేస్తాడు. ఇలా సుమారు 200 మంది అమ్మాయిలతో పరిచయాలు పెట్టుకుని బెదిరింపులకు దిగాడు. ఈ మొత్తం వ్యవహారం, హైదరాబాదు, బంజారాహిల్స్ లో చదువుకుంటున్న ఓ ఇంటర్ విద్యార్థిని ధైర్యంతో వెలుగులోకి వచ్చింది. మాజిద్ బెదిరింపులను తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో, వారు సైబరాబాద్ కమిషనర్ ను కలసి వివరాలు చెప్పారు. దీంతో తీగలాగిన పోలీసులు డొంకను కదిలించారు. ఇతని దగ్గర 200కు పైగా నగ్న చిత్రాలు ఉన్నట్టు పోలీసులు వివరించారు. మాజిద్ బాధితులు 9490617437, 9491030428 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News