: 30 రైళ్లకు శాశ్వత అదనపు బోగీలు, ఏ రైళ్లకంటే..!
పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 30 రైళ్లలో అదనంగా శాశ్వత బోగీలను కలపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 16 నుంచి ఈ బోగీలు ఏర్పాటవుతాయని, వీటిలో భాగంగా 31,252 బెర్తులు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని వివరించింది. 1,380 ఏసీ టూ టైర్ బెర్తులు, 8,704 ఏసీ త్రీ టైర్ బెర్తులు, 3,600 స్లీపర్ బెర్తులు, 17,568 చైర్ కార్ సీట్లను చేర్చనున్నట్టు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్ ప్రెస్, తిరుపతి-పూరి తిరుపతి ఎక్స్ ప్రెస్, తిరుపతి-బిలాస్ పూర్ తిరుపతి ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఏసీ త్రీ టైర్ బోగీలను జోడించనున్నామని వివరించింది. ద.మ.రై పరిధిలోని అన్ని రూట్లలో కొత్త బెర్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.