: బాబుగారూ... కలిసి పనిచేద్దాం: ఏపీ సీఎంకు సింగపూర్ ప్రధాని లేఖ


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి సింగపూర్ ప్రధాని ఎల్ హెచ్ లూంగ్ నిన్న ఓ లేఖ రాశారు. భవిష్యత్తులో కలిసి పనిచేద్దామని ఆ లేఖలో ఆయన చంద్రబాబుకు సూచించారు. ఇటీవల సింగపూర్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అధికార 'పీపుల్స్ యాక్షన్ పార్టీ' స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం ప్రధానిగా కొనసాగుతున్న లూంగ్ తదుపరి కూడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే లూంగ్ తన పార్టీ విజయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబుకు లేఖ రాశారు. ‘‘నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో భాగస్వామిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. భవిష్యత్తులో మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని ఆ లేఖలో లూంగ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News