: మెరిసిన లియాండర్ పేస్... యూఎస్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ కైవసం
వయసు పెరుగుతున్నా, భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ లో ఏమాత్రం పట్టు సడలడం లేదు. మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో సత్తా చాటుతున్న పేస్, తాజాగా యూఎస్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ ను చేజిక్కించుకున్నాడు. మార్టినా హింగిస్ తో కలిసి బరిలోకి దిగిన పేస్, అపజయమన్నదే లేకుండా జైత్రయాత్ర సాగించాడు. కొద్దిసేపటి క్రితం ముగిసిన ఫైనల్ లో బెథాని మాటెక్, శామ్ కెర్రీల జోడీపై 6-4, 3-6, 10-7 స్కోరుతో పేస్, హింగిస్ జోడి విజయం సాధించింది. ఈ టైటిల్ తో పేస్ 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు నెగ్గిన క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు.