: మక్కాలో ఘోర ప్రమాదం... భారీ క్రేన్ కూలడంతో 107 మంది దుర్మరణం, 200 మందికి గాయాలు
ముస్లింల పవిత్ర క్షేత్రం మక్కాలో రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. ఈ నెల 21 నుంచి ముస్లింల పవిత్ర మక్కా యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలోని మక్కాలో గ్రాండ్ మాస్క్ కు మరమ్మతులు జరుగుతున్నాయి. ఇందుకోసం భారీ యంత్రాలు అక్కడ పని చేస్తున్నాయి. నిన్న రాత్రి ఉన్నపళంగా ఓ భారీ క్రేన్ గ్రాండ్ మాస్క్ మీదుగానే పడిపోయింది. దీంతో అక్కడ ఉన్న వారిలో 107 మంది చనిపోగా, మరో 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 9 మంది భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం. క్రేన్ కూలిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు.