: హాలీవుడ్ సెలబ్రెటీలు ఫోన్లు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు
అవును, ఇప్పుడు హాలీవుడ్ సెలబ్రిటీలు ఫోన్లు చేసి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. వాళ్లకేం మాయరోగం అనుకోకండి...సామాజిక సేవ కోసం బీజీసీ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలు డబ్బులు అడుగుతున్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ బాధితుల కోసం ఏర్పాటు చేసే కార్యక్రమం నిమిత్తం బీజీసీ సంస్థ ప్రతి ఏటా ఇలా నిధులు సేకరిస్తోంది. ఈ నిధుల సేకరణలో భాగంగా సెలబ్రెటీలు ఫోన్లు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఉగ్రదాడి మృతుల కుటుంబ సభ్యులతో నిర్వహించనున్న కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థలకు ఈ విరాళాలు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు హాలీవుడ్ గాయనీ గాయకులు (పాప్ సింగర్స్), నటులు, మోడళ్లు, సెలబ్రెటీలు పాల్గొన్నారు.