: ఆ ఆరుగుర్ని పట్టించండి... లక్షలు పట్టుకెళ్లండి: ఎన్ఐఏ బంపర్ ఆఫర్
జమ్మూకాశ్మీర్ లోని ఉధంపూర్ జాతీయ రహదారిపై బీఎస్ఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపి పరారైన తీవ్రవాదుల తలలకు ఎన్ఐఏ వెల కట్టింది. ఆ దాడిలో పాల్గొన్న ఆరుగురు ఉగ్రవాదులకు సంబంధించిన కీలక సమాచారం అందిస్తే లక్షల రూపాయల నజరానా అందిస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. లష్కర్-ఏ-తోయిబాకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు అబుదుజనా (పాకిస్థాన్, 8 లక్షలు), అదిల్ షేర్ గుజ్రి (జమ్మూకాశ్మీర్, 8 లక్షలు), మాజిద్ జర్గర్ (జమ్మూకాశ్మీర్, 5 లక్షలు), మంజుర్ అహ్మద్ బట్ (జమ్మూకాశ్మీర్, 5 లక్షలు), ఆషిక్ హుస్సేన్ భట్ (జమ్మూకాశ్మీర్, 5 లక్షలు), హిజుబుల్ ముజాహిదీన్ కు చెందిన మొయిన్ కుచ్రు (జమ్మూకాశ్మీర్, 8 లక్షల రూపాయలు) ల తలలపై రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది.