: బయటకు వెళితే చేతిలో రూ. 500 నోటు ఉండాల్సిందే!: 'అసోచామ్' నివేదిక


మధ్య తరగతి ప్రజలు చేతిలో 500 రూపాయలు లేకుండా బయట కాలుపెడితే ఎలాంటి అవసరాలు తీరని విధంగా దేశంలో పరిస్థితులు నెలకొన్నాయని అసోచాం నివేదిక పేర్కొంది. కరెన్సీ నోట్ల వినియోగంపై 'అసోచాం' నివేదిక తయారు చేసింది. దేశంలో 500 రూపాయల నోట్ల వినియోగం అధికంగా ఉందని, మొత్తం మీద సుమారు 46.5 శాతం నోట్లను ప్రజలు వినియోగిస్తున్నట్టు తెలిపింది. 39.3 శాతంతో తరువాత 1000 రూపాయల నోట్లను ఎక్కువ మంది వినియోగిస్తున్నారని నివేదిక వెల్లడించింది. 100, 50 రూపాయల నోట్లను తక్కువ శాతం మంది వాడుతున్నారని నివేదిక అభిప్రాయపడింది. నాణేలలో 5 రూపాయల నాణేలు అత్యధికం వినిమయంలో వున్నాయని నివేదిక తెలిపింది. ఆ తరువాతి స్థానంలో 2 రూపాయల నాణేలు వినియోగంలో ఉన్నాయని అసోచాం నివేదిక పేర్కొంది.

  • Loading...

More Telugu News