: వామ్మో..కేజీ బరువున్న జూకాలు!
కేజీ బరువున్న జూకాలను ఎవరైనా ధరించగలరా? అంత సాహసం ఎవరు చేస్తారు? చెప్పండి. దుబాయ్ లోని జీఆర్ టీ జ్యుయలర్స్ షోరూంలో మూడు జతల చెవి జూకాలను ఆ సంస్థ ప్రదర్శనలో పెట్టింది. ఒక్కోటి కేజీ బరువు, రెండడుగుల పొడవు ఉన్న ఈ జూకాలను ధరించేందుకు కస్టమర్లు ధైర్యం చేయలేదని జీఆర్ టీ జ్యుయలర్స్ యజమాని ఆనంద్ అనంత పద్మనాభన్ తెలిపారు. చిన్న సైజు షాండ్లీయర్లులా ఉన్న వీటిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారని ఆయన తెలిపారు. వీటి ప్రదర్శనను సినీ నటి నయనతార ప్రారంభించారు. ఇంత పెద్ద బంగారు జూకాలు తయారు చేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటుదక్కుతుందని సంస్థ యజమాని ఆశాభావం వ్యక్తం చేశారు.