: తోటపల్లి ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమా?: మాజీ బాస్ కు సవాలు విసిరిన తమ్మినేని
విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతికి అంకితం చేసిన తోటపల్లి రిజర్వాయర్ ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి చెందుతుందని వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ, తోటపల్లి ప్రాజెక్టుకు రాజశేఖరరెడ్డి 450 కోట్ల రూపాయలు విడుదల చేస్తే, చంద్రబాబు 50 కోట్లు విడుదల చేశారని అన్నారు. అలాంటిది ప్రాజెక్టు తాను కట్టినట్టు చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన అభిప్రాయపడ్డారు. చేతనైతే తోటపల్లి ప్రాజెక్టుపై చర్చకు టీడీపీ నేతలైనా, సీఎం చంద్రబాబునాయుడైనా చర్చకు రాగలరా? అంటూ ఆయన సవాలు విసిరారు.