: మాదాపూర్ లో పేలుడు... 15 కార్లు ధ్వంసం


హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న బయోడైవర్శిటీ పార్కు వద్ద ఈ రోజు పేలుడు సంభవించింది. ఓ బహుళజాతి సంస్థ భవన నిర్మాణం చేస్తున్న ప్రదేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెల్లార్ నిర్మించడానికి జిలెటిన్ స్టిక్ తో పేలుడు జరిపారు. ఈ పేలుడులో 15 కార్లు ధ్వంసమయ్యాయి. అలాగే, 2 హోటళ్ల అద్దాలు పగిలిపోయాయి. పేలుడు శబ్దంతో చుట్టుపక్కల వారంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. పేలుడుకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. సదరు నిర్మాణ సంస్థ కార్మిక సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News