: తన సినిమాకి తానే కాంప్లిమెంట్ ఇచ్చుకున్న షారూఖ్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ తన సినిమాకి తానే కాంప్లిమెంట్ ఇచ్చుకుంటున్నాడు. సినిమాను మార్కెట్ చేసుకోవడం బాగా తెలిసిన షారూఖ్ వినూత్నంగా తన నూతన సినిమాకు పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న 'ఫ్యాన్' సినిమా చూసిన ప్రతిసారీ గర్వంగా, ఒకింత అహంకారంగా అనిపిస్తుంటుందని షారూఖ్ చెబుతున్నాడు. ఈ సినిమాలో ద్విపాత్రాభినయానికి తనను ఎంచుకున్నందుకు దర్శకుడు మనీష్ శర్మకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ సినిమాలో షారూఖ్ కు జంటగా ఇలియానా, వాణీ కపూర్ నటించారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.