: అక్కడ కుక్కలు కనిపిస్తే కాల్చేస్తామంటున్న అధికారులు...అదీ చూస్తామంటున్న స్థానికులు


తూర్పు చైనాలోని షాన్ డాంగ్ ప్రావిన్స్ లోని డయాంగ్ జిల్లా అధికారులు కుక్కలపై యుద్ధం ప్రకటించారు. కుక్క కనిపిస్తే చంపేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా కుక్క కనపడ్డానికి వీలులేదని ఆర్డర్ వేశారు. లైసెన్సులు ఉన్నా కుక్కను పెంచడానికి వీలు లేదంటూ తెగేసి చెప్పారు. ఇంట్లో కుక్క కనిపిస్తే అక్కడికక్కడే కాల్చి చంపేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. ఇంట్లో తనిఖీలు చేసే అధికారం వారికెవరిచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు. తన దగ్గర కుక్కను పెంచుకునేందుకు లైసెన్స్ ఉందని, కుక్కను ఇంట్లోనే ఉంచుకుంటానని, అధికారులు ఏం చేస్తారో చూస్తానని ఓ స్థానికుడు సవాలు విసిరాడు. అయితే, పరిశుభ్రత, ప్రజా శ్రేయస్సు కోసం ఈ చర్యలు తీసుకుంటున్నామని అక్కడి అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News