: ఏకదంతుడికి నైవేద్యం లక్షాపాతిక వేల లడ్డూలు!


వినాయకచవితి పండుగ దగ్గర పడుతున్న కొద్దీ 'లడ్డూ'ల హల్ చల్ కాస్త ఎక్కువైంది. లంబోదరుడికి ప్రీతిపాత్రమైన ప్రసాదం కావడంతో లడ్డూలు తయారు చేసేందుకు వంటగాళ్లు పోటీ పడుతుండగా, నైవేద్యంగా సమర్పించేందుకు భక్తులు ఉత్సాహం చూపుతున్నారు. జైపూర్ లోని మోతీ దుంగ్లీ ఆలయంలో కొలువుదీరిన గణనాథుడికి ఆలయ నిర్వాహకులు నైవేద్యంగా సమర్పించిన లడ్డూలు లక్షాపాతికవేలు. గణేశ సప్తాహంగా పిలుచుకునే ఈ సంప్రదాయంలో వినియకచవితికి వారం రోజుల ముందు ఆలయ నిర్వాహకులు నైవేద్యంగా లడ్డూలు సమర్పిస్తారు. వినాయకచవితి రోజున వీటిని భక్తులకు పంచుతారు. కాగా, ఈ లడ్డూలు తయారు చేసేందుకు భక్తులే వలంటీర్లుగా వస్తారు. ఈసారి 200 మంది వలంటీర్లు వచ్చారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది 251 కేజీల నుంచి వంద గ్రాముల వరకు వివిధ సైజుల్లో లడ్డూలు నైవేద్యంగా సమర్పించామని వారు వివరించారు. ఈ సంప్రదాయం చాలాకాలంగా వస్తున్నట్టు వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News