: ఆప్ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతిపై హత్యాయత్నం కేసు
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతిపై ఆయన భార్య లిపికా మిత్రా చేసిన ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దానిపై లిపికా మాట్లాడుతూ, తాను నిన్న (గురువారం) ఫిర్యాదు చేయగా తన భర్తపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని మీడియాకు తెలిపారు. తన భర్తపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు మూడు నెలల సమయం పట్టిందని, పోలీసులు తమ పనిని ఇప్పుడైనా చేశారని చెప్పారు. తాను గర్భవతిగా ఉన్న సమయంలో తనపై భర్త దాడికి పాల్పడ్డాడని లిపికా పేర్కొన్నారు. దానికి సంబంధించి బలమైన సాక్ష్యాలున్నాయన్నారు. అయితే తాను ఫిర్యాదు చేసిన తరువాత జరుగుతున్న పరిణామాలపై చాలా అసంతృప్తిగా ఉన్నట్టు తెలిపారు. తన భర్త చాలా శక్తిమంతుడని, ఆయన వెనుక సీఎం కేజ్రీవాల్ ఉన్నారని ఆమె ఆరోపించారు.