: రోశయ్యకు అస్వస్థత
తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య స్వల్ప అస్వస్థత కారణంగా విజయవాడలోని ఒక ఆసుపత్రిలో చేరారు. కృష్ణా జిల్లాలోని పోరంకిలో ఈరోజు జరిగిన ఆర్యవైశ్య సంఘం సమావేశాలకు ముఖ్య అతిధిగా రోశయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై ప్రసంగిస్తున్న ఆయన హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు.