: కొడతానంటూ... రఘువీరాకు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక


ఏపీ ప్రత్యేక హోదాపై మోసం చేశారంటూ ప్రధానమంత్రి, వెంకయ్యనాయుడు, చంద్రబాబులపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కేసులు పెడుతుండటంపై ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర హెచ్చరిక చేశారు. పధ్ధతి మార్చుకోకపోతే ఆయన ఇంటికెళ్లి కొడతానని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనం కోసం కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిందని, విభజనలో ప్రజలకు అన్యాయం చేసింది కాంగ్రెస్సేనని మండిపడ్డారు. ఇప్పుడేమో ప్రజల కోసం తామున్నామంటూ దొంగనాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. జేసీ వ్యాఖ్యలపై పీసీసీ అధికార ప్రతినిధి నాగరాజు స్పందిస్తూ, ఆయనకు పిచ్చి పట్టిందని, వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించాలని అన్నారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు లబ్ధి పొంది, ఇవాళ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రఘువీరాను విమర్శించే అర్హత జేసీకి లేదన్నారు.

  • Loading...

More Telugu News