: టీఆర్ఎస్ మంత్రులు చవట దద్దమ్మలు: టీకాంగ్రెస్


మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డిలపై మంత్రి మహేందర్ రెడ్డి చేసిన ఆరోపణలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులపై అవగాహన లేకపోవడంవల్లే సబితపై మహేందర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ మంత్రులంతా చవట దద్దమ్మలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదవి ఉన్నంత వరకే మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో ఉంటారని... అప్పటిదాకా కేసీఆర్ బూట్లు తుడుస్తూ కాలం గడుపుతారని అన్నారు. మహేందర్ రెడ్డి కేవలం బొమ్మ మంత్రేనని... దమ్ముంటే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రంగారెడ్డి జిల్లాకు వచ్చేలా కేసీఆర్ ను ఒప్పించాలని సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News