: రాష్ట్రపతి ఆహ్వానం చూసి నోరెళ్లబెట్టిన బాలీవుడ్ కమెడియన్!


టీవీషోల నుంచి బిగ్ స్క్రీన్ కు ఎదిగిన బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి ఆహ్వానం అందింది. రాష్ట్రపతి భవన్ లో జరిగే తేనీటి విందుకు రావాలన్నదే ఆ ఆహ్వానం సారాంశం. దీన్ని చూసిన తరువాత కపిల్ శర్మకు కలిగిన ఆనందంతో నోటి వెంట మాటే రాలేదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతూ, అంత గొప్ప వ్యక్తి నుంచి పిలుపు రావడంతో తనకెంతో గర్వంగా ఉందని అన్నాడు. హేమాహేమీలతో కలసి టీపార్టీ జరుపుకునే అవకాశం దక్కడం సంతోషంగా ఉందని వివరించాడు. ఇంతకీ ఆహ్వానం ఎందుకంటే, ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ మొదలై ఏడాది జరిగిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రచారకర్తలను పిలిచి విందు ఇవ్వాలని ప్రణబ్ భావించారు. స్వచ్ఛ భారత్ కు ప్రచారకర్తగా కపిల్ శర్మ పేరు కూడా ఉండటంతో, ఆయనకూ ఆహ్వానం వచ్చింది.

  • Loading...

More Telugu News