: 'హైక్' మెసెంజర్ నుంచి 'ఉచిత గ్రూప్ ఆడియో కాలింగ్ ఫీచర్'
ఇప్పటివరకు మెసెంజర్ గా పనిచేసిన ప్రముఖ సామాజిక వేదిక 'హైక్' కొత్త ఆఫర్ ప్రకటించింది. ఉచిత గ్రూప్ కాల్ చేసుకునే ఆఫర్ ను ప్రారంభించింది. దీని పేరు గ్రూప్ ఆడియో కాలింగ్ ఫీచర్. దాని ద్వారా ఒక్క కాల్ లో వందమందితో ఒకేసారి మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ సౌకర్యాన్ని 4జీ, వైఫై ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లకు అందిస్తున్నారు. ఈ సంవత్సరం చివరినాటికల్లా ఐవోఎస్, విండోస్ ఫోన్లకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. హైక్ మెస్సెంజర్ యజమాని, టెలికాం దిగ్గజం సునీల్ భారతి మిట్టల్ కుమారుడు కెవిన్ భారతి మిట్టల్ ఈ కొత్త ఫీచర్ ను ప్రారంభించారు.