: అమీర్ ఖాన్ 'సత్యమేవ జయతే' కార్యక్రమంపై కేసు


బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ వ్యాఖ్యాతగా రూపొందిస్తున్న సత్యమేవ జయతే కార్యక్రమంపై బర్నింగ్ బ్రెయిన్ సొసైటీ అధ్యక్షుడు హర్మన్ సింగ్ సిద్దూ ప్రజా ప్రయోజనవ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ చిహ్నాన్ని తప్పుగా వినియోగించారని అందులో పేర్కొన్నారు. సత్యమేవ జయతేలో వాస్తవాల పేరిట ప్రజలను తప్పుదారి పట్టించే రీతిలో చర్చలు జరుపుతున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై నవంబర్ 3న న్యాయస్థానం విచారణ జరపనుంది. కాగా, హర్మన్ సింగ్ సిద్దూ ఛండీగఢ్ లో బర్నింగ్ బ్రెయిన్ సొసైటీ పేరిట స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు.

  • Loading...

More Telugu News