: ఉగ్రదాడుల బెదిరింపులతో ఫుల్ అలర్ట్ అయిన జపాన్
మలేషియా, బోస్నియా, హెర్జిగోవినా, ఇండొనేషియాలలో దాడులు చేస్తామని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన నేపథ్యంలో, జపాన్ చాలా వేగంగా స్పందించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ రాయబార కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించింది. అవసరమైతే అదనంగా సైనికులను మోహరింపజేసుకోవాలని సూచించింది. సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఇద్దరు జపాన్ దేశీయులను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా తలలను కోసి చంపేశారు. ఈ నేపథ్యంలో, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఎంతకైనా తెగిస్తారని భావించిన జపాన్... క్షణం కూడా ఆలస్యం చేయకుండా కార్యరంగంలోకి దూకింది. పసిఫిక్ తీరం వెంబడి ఉన్న విదేశాంగ కార్యాలయాలన్నీ అలర్ట్ గా ఉండాలని ఆదేశించింది.