: ఆరేళ్లలో మాఫియా రాణిగా మారిన ఓ యువతి కథ!


అక్రమ కట్టడాల నిర్మాణం నుంచి క్రమేపి మాఫియా రాణిగా ఎదిగిన యువతి కరీమా ముజీబ్. ఆరేళ్లుగా ముంబయిలో ఎదురు లేకుండా ఉన్న కరీమాను గత ఆరు నెలల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. అది కూడా ఆమె గ్యాంగ్ లో సభ్యుడు ఒకరు అరెస్టు కావడంతో ఈ మాఫియా రాణి కథ వెలుగు చూసింది. ఆమె వయస్సు 45 సంవత్సరాలు. ఆరు సంవత్సరాల కాలంలో ఆమె ఎదిగిన తీరు చాలా ఆశ్చర్యం గొలుపుతుంది. కరీమా గురించి తెలుసుకున్న పోలీసులు కూడా నోరెళ్ళ బెట్టారు. ఎందుకంటే, వారు ఎప్పుడూ ఊహించని విషయాలు వారికి తెలిశాయి. ఆ విషయాలు ఏమిటంటే.. ముంబయిలోని ఘట్కోపర్ కు చెందిన కరీనా నాల్గవ తరగతి వరకు చదువుకుంది. అదే ప్రాంతంలో అక్రమ నిర్మాణాలతో తన క్రిమినల్ కెరీర్ ను మొదలుపెట్టింది. కొన్నేళ్లలోనే పలుకుబడి పెరిగిపోయింది. దాంతో పాటు శత్రువులూ పెరిగారు. ఆమెకు, తుక్కు వ్యాపారి అయిన తన భర్తకు రక్షణకు గాను నమ్మకంగా ఉండేందుకు సాన్ బాబు పానిక్ర్ అనే వ్యక్తిని నియమించుకుంది. ఇక ఆ ప్రాంతంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించడానికి ప్రధాన కారణం.. ఆ ప్రాంతంలో ఉన్న వారు ఏదైనా సమస్య వస్తే ఆమె దగ్గరకు పరిగెత్తుకు వెళ్లడమే. పెద్దక్కగా పిలిపించుకునే కరీమా క్రమంగా చిన్న చిన్న గొడవలు పరిష్కరించడం, సెటిల్ మెంట్లు చేయడం మొదలు పెట్టింది. కామరాజ్ నగర్ లోని ఆమె నివాసంలో రాజఠీవిలో కుర్చీలో కూర్చుని సమస్యలు పరిష్కరిస్తూ ఉండేది. తన గ్యాంగ్ లో సభ్యుల సంఖ్యను పెంచుకునేందుకు గాను ఆ ప్రాంతంలో అనాథ పిల్లలను దత్తత తీసుకునేది. వారి బాధ్యతలు చూసుకునేది. వారితో దొంగతనాలు చేయించేది. దొంగతనంలో పాలుపంచుకున్న వాళ్లందరికీ వాటాలు సమానంగా వేసేది. దోచుకోవడం, చైన్ స్నాచింగ్ వంటి పనులు చేసేందుకు గాను 50 మంది వరకు ఉండేవారు. ఈ గ్యాంగ్ లో ప్రతి ఒక్కరిదీ ఒక్కొక్క పాత్ర. చైన్ స్నాచింగ్ చేసే వారి కోసం మోటార్ బైకులిచ్చేది. దోపిడీ చేసే వారి కోసం కార్లు, ట్యాక్సీలు ఉండేవి. సెలవులకు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లేవారి జాబితాను, కేవలం ఒక్కరే ఉండే ఇళ్ల సమాచారం చెప్పేందుకు కొంతమంది ఉండేవారు. కరీమా మాఫియా గ్యాంగ్ లో ప్రధానంగా మొత్తం ఆరుగురు సభ్యులు వుంటారు. గ్యాంగ్ సభ్యులను ఆమె కంటికి రెప్పలా చూసుకోవడం కారణంగా ఆరేళ్ల పాటు పోలీసుల కళ్లు కప్పి ఊహించని స్థాయిలో దొంగతనాలకు పాల్పడిన కరీమా ఎట్టకేలకు పోలీసులకు చిక్కి జైల్లో ఊచలు లెక్కబెడుతోంది.

  • Loading...

More Telugu News