: సన్నీలియాన్ నృత్యాలపై విరుచుకుపడ్డ రాఖీ సావంత్
సన్నీలియాన్ చేస్తున్న శృంగార నృత్యాలు యువతలో వేడిని పుట్టిస్తూ, అత్యాచారాలను పెంచేలా ఉన్నాయని, హాట్ గర్ల్ రాఖీ సావంత్ నిప్పులు చెరిగింది. సన్నీలియాన్ ను, ఆమె చిత్రాలు, పాటలను ఇండియాలో నిషేధించాలని డిమాండ్ చేసింది కూడా. "ఒక వైపు ప్రజా ప్రయోజనాలంటూ ఆమె ప్రకటనల్లో నటిస్తోంది. మరోవైపు శృంగార నృత్యాలు చేస్తూ, ప్రజలను కిర్రెక్కిస్తోంది. యువతులపై లైంగిక వేధింపులు పెరగడానికి ఇటువంటి వ్యక్తులే కారణం" అని 36 ఏళ్ల రాఖీ వ్యాఖ్యానించింది. ఆమె శరీరంపై పూర్తిగా దుస్తులు ధరించి నటిస్తేనే అనుమతించాలని అంటోంది. ఇదిలావుండగా, సన్నీ వచ్చిన తరువాత రాఖీకి అవకాశాలు తగ్గాయేమో, అందువల్లే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తోందని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ప్రస్తుతం రాఖీ సావంత్, ఇంద్రాణి ముఖర్జీ జీవిత చరిత్ర ఆధారంగా అజీజ్ జీ తెరకెక్కించనున్న 'ఏక్ కహానీ జూలీ కీ' చిత్రంలో నటించనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోనూ ఆమె ఒంటినిండా దుస్తులతోనే నటిస్తుందేమో? వేచి చూడాల్సిందే!