: ఆటగాళ్ల ఫిక్సింగ్ బాగోతాలు చూడలేకనే దూరమయ్యా: పాక్ క్రికెట్ పై మియాందాద్ బాంబులు!
పాకిస్థాన్ క్రికెట్ టీంలో జరుగుతున్న అవినీతి బాగోతాలు, ఫిక్సింగ్ స్కామ్ లను చూడలేకనే తాను కోచ్ పదవికి రాజీనామా చేశానని మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. "ఈ విషయాన్ని అప్పట్లో క్రికెట్ బోర్డు చైర్మన్ కు వివరించాను. చర్యలు తీసుకోవాలని కోరాను కూడా. చర్యలు తీసుకోకుంటే పరువు పోతుందని హెచ్చరించాను. అప్పట్లో నా మాటెవరూ వినలేదు. అందుకే నేను 1999లో కోచ్ పదవికి రాజీనామా చేశా" అని వివరించాడు. మొత్తం 124 టెస్టులు, 233 వన్డేలు ఆడిన మియాందాద్, పాక్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ జనరల్ గా కూడా సేవలందించాడు. మియాందాద్ వ్యాఖ్యలు పాక్ క్రికెట్లో తాజా చర్చనీయాంశాలయ్యాయి.