: ఈర్ష్యాద్వేషాలతోనే ఉండవల్లి అసత్య ప్రేలాపనలు: దేవినేని ఉమ
పట్టిసీమ ప్రాజెక్టుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను మంత్రి దేవినేని ఉమ తిప్పికొట్టారు. కృష్ణానది, గోదావరి జలాల అనుసంధానంపై మాట్లాడే అర్హత ఉండవల్లికి లేదన్నారు. విభజన సమయంలో రాష్ట్ర ప్రజల గొంతుకోసిన ఉండవల్లి, వైసీపీ నేతలు పట్టిసీమ ప్రాజెక్టు గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. రాయలసీమ ప్రజల మంచి కోసం టీడీపీ ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే, కేవలం ఈర్ష్యాద్వేషాలతోనే ఉండవల్లి అసత్య ప్రేలాపనలు చేస్తున్నారని ఉమ మండిపడ్డారు.