: రాయలసీమకు పప్పన్నం కాదు, గన్నేరుపప్పు పెడుతున్నారు: ఉండవల్లి


ఏపీకి పట్టిసీమ ప్రాజెక్టు అవసరం లేదని... కేవలం ముడుపుల కోసమే ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. పనులు పూర్తి కాకుండానే పట్టిసీమను జాతికి అంకితం చేశారని... గతంలో ఇలాంటి సంఘటన ఎన్నడూ జరగలేదని అన్నారు. రాయలసీమకు పప్పన్నం పెడుతుంటే విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయిని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుబట్టారు. సీమకు పప్పన్నం కాదు, గన్నేరుపప్పు పెడుతున్నారంటూ విమర్శించారు. మొన్న కృష్ణాలోకి తరలించింది పట్టిసీమ నీరు కాదని... తాటిపూడి ఆయకట్టు నీరు అని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఉండవల్లి అన్నారు. గోదావరి జలాలను విశాఖకు కూడా తీసుకొస్తామని చంద్రబాబు చెబుతుండటం విడ్డూరంగా ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News