: టీడీపీ, వైసీపీ కుమ్మక్కయ్యాయట... కాంగ్రెస్ నేత కోట్ల విచిత్ర కామెంట్!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి కొద్దిసేపటి క్రితం విచిత్ర కామెంట్ చేశారు. ఏపీలో అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు కుమ్మక్కయ్యాయని ఆయన ఆరోపించారు. ఓ పక్క అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై మరొకరు అనుచిత వ్యాఖ్యలతో విరుచుకుపడుతుంటే, కోట్ల మాత్రం వాటి మధ్య లోపాయికారి మైత్రి కొనసాగుతోందని ప్రకటించారు. రాష్ట్రంలో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించిన ఆయన తక్షణమే సంఘాలను రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో అధికార, విపక్షాలు కుమ్మక్కయ్యాయని కోట్ల ఆరోపించారు.