: భార్య డ్యాన్స్ చేసిందంటూ ఆమెకు విడాకులిచ్చేశాడు!


మత విశ్వాసాలకు విరుద్ధంగా వెళుతూ, పెళ్లినాడు చేసిన ప్రమాణాలను తుంగలో తొక్కి తన కిష్టమైన పాటలు వినడమే కాకుండా, వాటికి డాన్సులు కూడా చేసిందని ఆరోపిస్తూ, విడాకులిచ్చేశాడో భర్త. తాను వారించినా వినకుండా నృత్యాలు చేసిందన్న సాకుతో వివాహ బంధాన్ని తెంచుకున్న ఈ ఘటన సౌదీ అరేబియాలో జరిగింది. ఇస్లామిక్ భక్తి చానళ్లు తప్ప మరే ఇతర కార్యక్రమాలను టీవీలో చూడవద్దని ఆదేశించినా, తన భార్య పట్టించుకోలేదని ఆరోపిస్తున్నాడు. తాను ఇంట్లో లేనప్పుడు పాటలు వింటూ, డ్యాన్సులు చేస్తోందని చెబుతూ, వెంటనే 'తలాక్' అనేశాడు. ఈ వార్తను సౌదీలోని ప్రసార మాధ్యమాలు, మీడియా ప్రజల ముందుకు తీసుకొచ్చాయి. అయితే, వీరి వివరాలు మాత్రం వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News