: వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదు... నిబద్ధత కలిగిన కాంగ్రెస్ కార్యకర్తనంటున్న దేవినేని నెహ్రూ
తాను వైసీపీలోకి వెళుతున్నానంటూ జరుగుతున్న ప్రచారమంతా ఒట్టి పుకారేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అన్నారు. నిబద్ధత కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్న తాను ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ మేరకు నేటి ఉదయం మీడియా ముందుకు వచ్చిన ఆయన తాను వైసీపీలో చేరుతున్నానన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తుది వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన ప్రకటించారు.