: రంగంలోకి దూకిన నందమూరి హరికృష్ణ...‘కేశవరెడ్డి’ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్
టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ మళ్లీ తెరముందుకు వచ్చారు. చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న హరికృష్ణ మీడియా ముందుకు కూడా రావడం లేదు. ఇటీవల తన కుమారుడు చనిపోయిన సమయంలోనూ ఆయన అంతగా బయటకు రాలేదు. తాజాగా నేటి ఉదయం ఆయన మీడియా ముందుకు వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యా సంస్థగా ఎదిగిన కేశవరెడ్డి విద్యా సంస్థల యాజమాన్యం చేసిన మోసంపై ఆయన గళం విప్పారు. కేశవరెడ్డి విద్యా సంస్థల వద్ద డిపాజిట్ చేసిన వారికందరికీ న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఆ విద్యా సంస్థల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల విద్యా బోధనకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.