: కందుకూరులో నారా లోకేశ్... టీడీపీ రాజకీయ శిక్షణా తరగతులను ప్రారంభించిన యువనేత
టీడీపీ యువనేత, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ నేడు ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నేటి ఉదయం విజయవాడలోని సీఎం తాత్కాలిక నివాసం నుంచి బయలుదేరిన లోకేశ్ కొద్దిసేపటి క్రితం ప్రకాశం జిల్లా కందుకూరు చేరుకున్నారు. అక్కడి గాయత్రి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో ఆయన ముఖాముఖీ భేటీ అయ్యారు. అనంతరం కళాశాలలో పార్టీ కార్యకర్తల కోసం ఉద్దేశించిన రాజకీయ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోని తిరుపతి చేరుకుంటారు. అక్కడ కూడా పార్టీ కార్యకర్తల రాజకీయ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభిస్తారు.